NZB: ఎడపల్లి మండలం బాపునగర్ చెందిన రేపాక హరిబాబు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 3న హరిబాబు మద్యం సేవించి ఇంటికి రావడంతో తల్లి పుష్ప అతడిని మందలించారు. మరుసటి రోజు ఉదయం పని నిమిత్తం తన స్కూటీపై బయటకు వెళ్లిన ఆయన, రాత్రి అయినా తిరిగి రాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.