శ్రీకాకుళం రెండవ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం బలగ, పాత్రనివలస, డెంటల్ కళాశాల, నది పరివాహక ప్రాంతాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా నిర్వహించారు. బహిరంగ మద్యం, గంజాయి సేవనం, జూదం, ఈవ్టీచింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు డ్రోన్ సాయంతో పరిస్థితులను పరిశీలించారు.