KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం ప్రధాన కాలువ ద్వారా 5వ విడతలో భాగంగా 1200 క్యూసెక్కుల నీటిని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. కాలువల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశుపాలకులు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి, కాలువ ఒడ్డుల సమీపానికి వెళ్లవద్దని నిజాంసాగర్ నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు.