MNCL: నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామపంచాయతీ ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై మురికి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాళాలలోని మురికి నీరు రోడ్డుపై నిల్వ ఉండడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, వాహనదారులు, విద్యార్థులు సైతం జారీ పడుతున్నారన్నారు.