»Arogya Manya Program Will Be Launched From March 8
World Womens Day : మార్చి 8 నుండి ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం
ప్రపంచ మహిళా దినోత్సవం( World Womens Day ) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8వ తేదీన ప్రారంభించే ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతం చేయాలి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
ప్రపంచ మహిళా దినోత్సవం( World Womens Day ) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8వ తేదీన ప్రారంభించే ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతం చేయాలి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది అని తెలిపారు. మహిళలు ( Womens ) ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకి వైద్యం అందిస్తుందన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా దీన్ని అందిస్తున్నదని చెప్పారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభిస్తాం అని హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు.
మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తం 1200 సెంటర్లకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. మధుమేహం,(diabetes) రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలుఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..థైరాయిడ్ పరీక్ష,(Thyroid test) సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు.నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు. అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.బరువు నియంత్రణ, యోగా,(yoga) వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.