»Anything Can Happen In Telangana After The Parliament Elections Bjp Leader Laxman
BJP leader Laxman: పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో ఏదైనా జరగొచ్చు
హిమాచల్ ప్రదేశ్లో జరగిన తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీ రాష్ట్ర సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ తెలంగాణ రాజకీయాలపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులా తాయరైంది నేటి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
Anything can happen in Telangana after the Parliament elections.. BJP leader Laxman
BJP leader Laxman: బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్(K Laxman) తెలంగాణ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలపై జోష్యం చెప్పారు. ఎన్నికల తరువాత మరో కర్ణాటక అవుతుందో, హిమాచల్ ప్రదేశ్ అవుతుందో చూద్దామన్నారు. ప్రస్తుతం తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరగబడ్డారు అందుకే రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేసినట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితియే తెలంగాణలో రాబోతుందని అన్నారు.
తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పరిస్థితి దారుణంగా ఉందని, లోక్సభ ఎన్నికల తరువాత మరీ దారుణంగా తయారు అవుతుందని హెచ్చరించారు. ఆయనకు ఉన్నవి కేవలం 64 సీట్లే అని గుర్తు చేశారు. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు మోసపూరిత వాగ్ధానాలేనని, వాటిని అమలు చేయడానకిి బడ్జెట్ కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు.