»Announce Ex Gratia To Children Familybjp Mla Raja Singh
Raja singh:చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయండి, ప్రభుత్వాన్ని కోరిన రాజా సింగ్
Raja singh:అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు (child) చనిపోయిన ఘటనపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) స్పందించారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కోరారు. నాలుగేళ్ళ బాలుడు ప్రదీప్ (pradeep) కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
Raja singh:అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు (child) చనిపోయిన ఘటనపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) స్పందించారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కోరారు. నాలుగేళ్ళ బాలుడు ప్రదీప్ (pradeep) కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి సమస్యలపై దృష్టిసారించాలని మంత్రి కేటీఆర్‌ను (ktr) కోరారు.
అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి శక్తి మేర ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. కుక్కలన్నీ కలిసి ఆ చిన్నారిని దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ (gangadhar) నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. అంబర్ పేట ‘చే నెంబర్’ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్లో వాచ్ మెన్‌గా (watchmen) పని చేస్తున్నాడు. భార్య జనప్రియ (jana priya), ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌తో (pradeep) కలిసి అంబర్ పేట ఎరుకుల బస్తీలో ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో గంగాధర్ ఇద్దరు పిల్లలను వెంట బెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్‌కు (service centre) వెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు.
అతను అక్కడ ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్ మెన్‌తో కలిసి పని మీద బయటికి వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్నాడు. ఆ తర్వాత అక్క (sister) కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో వీధి కుక్కలు వెంటపడ్డాయి. దాడి చేసి, ఆ చిన్నారిని చిదిమేశాయి. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలచివేశాయి. ఆ చిన్నారిని తిరిగి తీసుకురాలేమని.. ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రభుత్వాన్ని కోరారు.
రాజా సింగ్ అలా డిమాండ్ చేశారో లేదో.. వెంటనే గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ స్పందించారు. ఆ బాలుడి కుటుంబాన్ని అనివిధాలా ఆదుకుంటామని చెప్పారు.