మెదక్: తాండూర్ పట్టణంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశువు మృతి చెందింది. పెద్దేముల్ మండలం తట్టేపల్లికి చెందిన నర్సింలు భార్య రాజేశ్వరి గర్భందాల్చింది. పురిటినొప్పులు రాగా కుటుంబీకులు మాతా, శిశు ఆసుపత్రికి తరలించగా వైద్యులు కాన్పు చేశారు. మగ శిశువు పుట్టినా కాన్పులోనే చనిపోయాడు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లితండ్రులు ఆరోపించారు.