GDWL: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని అలంపూర్ దేవస్థానాల్లోని ఆలయాల్లో సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో దీప్తి శనివారం ప్రకటించారు. ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య వంటి విశేష దినాల్లో సాయంత్రం 6:00 గంటలకు ఈ దీపోత్సవం జరుగుతుంది. ఈవో తెలిపిన వివరాల ప్రకారం, దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు దేవస్థానం తరఫున ఉచితంగా ప్రమిదలు, వత్తులు అందిస్తామన్నారు.