HNK: జిల్లాలోని వివిధ మండలాల్లో మంగళవారం రాత్రి 2.5 మి.మీ. నుంచి 15.6 మి.మీ. మధ్య వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ధర్మసాగర్, ఐనవోలు, దామెర, ఆత్మకూరు మండలాల్లో 10.5 మి.మీ., హనుమకొండ, కాజీపేట, హసన్పర్తి, శాయంపేటలో 15.6 మి.మీ. వర్షం నమోదైంది. సాయంత్రం 4.30 నుంచి 7.30 గంటల మధ్య కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది.