SRPT: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నడిగూడెం సర్పంచి దున్న శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన చేపట్టిన మార్నింగ్ వాక్ ప్రజల కష్టాలను తెలుసుకునే వేదికగా మారింది. గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా ముచ్చటించిన సర్పంచి.. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ఆరా తీశారు.