SRPT: గ్రామాల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పలు మండలాల సర్పంచులు, వార్డు సభ్యులను ఆయన సన్మానించారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయని, రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటుతుందని సంకినేని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.