WGL: అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలు హాస్టళ్లు నిర్వహిస్తుండటం పై వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవాళ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కు వినతిపత్రం సమర్పించాయి. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపుతూ అక్రమ హాస్టళ్లు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.