తెలంగాణ (Telangana) ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్నిరద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు (MLA Duddilla Sridhar Babu) సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగులంతా ఉద్యమించారని, అలాంటి ఉద్యోగులు, పెన్షన్ దారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భగా 30 ఐఆర్, 4శాతం డీఏ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెల1వ తేదీన వేతనాలు ఇవ్వాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ ప్రతి నెల1వ తేదీన వేతనాలు ఇచ్చే వాళ్లమని, పండుగల సమయంలో వేతనాలు ముందుగానే అందించే వారమని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వక పోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నెల వారిగా చెల్లించాల్సిన ఈఎంఐ(EMI)లు చెల్లించ లేక పోవడంతో సిబిల్ స్కోర్ పడిపోయి, బ్యాంకులు రుణాలు(Banks loans) కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఉద్యోగులకు, పెన్షషన్ దారులకు 1వ తేదీన వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను ఆ లేఖలో శ్రీధర్ బాబు కోరారు.