చెప్పు గురించి కాకుండా ముందు పవన్ కల్యాణ్ (Pawan Kalyan )జనసేన పార్టీ గుర్తుపై ఆలోచించాలని మాజీ మంత్రి పేర్ని నాని (Perni nani) హితవు పలికారు. ఏపీలో వైసీపీ (YCP), జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తనను బూతులు తిట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పుడెప్పుడో చెప్పు చూపించి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్‌గా మూడు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని రెండు చెప్పులు చూపించి పవన్ ను విమర్శించారు. అయితే ఆ చెప్పులు తనదేననని.. ఓ వైసీపీ నాయకుడు ఎత్తుకెళ్లాడని పవన్ కల్యాణ్ గట్టిగా రిప్లై ఇచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో చెప్పు మాటల యుద్ధానికి ఆయుధంగా మారింది.
ఇక పవన్ కల్యాణ్ ఇచ్చిన చెప్పు రిప్లైపై పేర్ని నాని సైతం స్పందించారు. చెప్పులు (Ceppulu) మూడు రోజులు అయితే పవన్ ఇప్పుడు కంగారు పడుతున్నారని ఆయన అన్నారు. గతేదాడి గుడికి వెళ్తే అక్కడ తన చెప్పు పోయిందని.. అయితే గుడి ఎదురుగా జనసేన (Janasena) ఆఫీసు ఉందని.. పవన్ కల్యాణ్‌ను అనుమానిస్తామా అని కాస్త వ్యంగ్యంగా విమర్శించారు. చెప్పులు పోతో ఎవరో ఒక నిర్మాత కొనిస్తారని, కానీ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు (Gaju glass) పోయిందని ఎద్దేవా చేశారు. చెప్పులు మర్చిపొతే తెచ్చుకోవచ్చు కానీ.. పార్టీ గుర్తు పోతే ఎలా? అని ప్రశ్నించారు. ముందు మీ పార్టీ గుర్తు పోయిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పవన్‌ని సూచించారు.