హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సాధారణ ఛార్జీల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తుండటంతో, గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, లబోదిబోమంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, అధిక ఛార్జీల వసూళ్లను అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.