MDK: చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈనెల మూడవ తేదీన దొంగతనానికి వచ్చాడని భావించి స్థానికులు జంగరాయ్ గ్రామానికి చెందిన యోహాన్ అనే వ్యక్తిపై పెట్రోల్ పోసిని నిప్పు అంటించిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన యోహాన్ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై చైతన్య రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.