MNCL: నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ హయాంలో అవినీతి పెరిగిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మాట్లాడారు. అవినీతి, అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే తేదీ, సమయం నిర్ణయించాలని సవాల్ విసిరారు.