PDPL: గోదావరిఖని తిలక్ నగర్లో వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి కళాబృందం ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో నిత్యం జరుగుతున్న సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, క్రైమ్, మహిళల రక్షణ- చట్టాలు, డ్రగ్స్ నియంత్రణ తదితర విషయాల గురించి ఆట పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్ పాల్గొని ప్రజలను చైతన్య పరిచారు.