BDK: మణుగూరు పట్టణంలో యువకులు శబ్దం చేస్తూ నడుపుతున్న బుల్లెట్ బైక్ను ఆదివారం సీఐ నాగబాబు తనిఖీ నిర్వహించి పట్టుకున్నారు. శబ్దం చేసే బుల్లెట్ బండ్ల వల్ల కాలుష్యం అలాగే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని సీఐ తెలిపారు. అనుమతి లేకుండా ఇటువంటి చర్యలు చేపడితే ఉపేక్షించమని హెచ్చరించారు. వారితోపాటు ఎస్సై రంజిత్ ఉండగా బైక్ను స్టేషన్కు తరలించారు.