ADB: జిల్లావ్యాప్తంగా వైన్స్ షాపుల టెండర్లకు ఈరోజు (సోమవారం) నిర్వహించాల్సిన లక్కీ డ్రాను ఆరు షాపులకు నిలిపివేసినట్లు ఎక్సైజ్ అధికారి హిమశ్రీ తెలిపారు. తక్కువ దరఖాస్తులు రావడంతో ADB పరిధిలోని 016, 017, 018, ఇచ్చోడ పరిధిలోని 025, 028, ఉట్నూర్ పరిధిలోని 040 నంబర్ గల షాపుల డ్రాను వాయిదా వేశారు. త్వరలో ఈ షాపులకు డ్రా తేదీ నిర్ణయిస్తామని ఆమె వెల్లడించారు.