MDK: చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు గ్రామ పంచాయతీ పాలక వర్గం వినతి పత్రం సమర్పించారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రోడ్డు మరమ్మతులు చేయాలన్నారు. ఎంపీ సానుకూలంగా స్పందించి గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు తన వంతుగా సహకారం అందిస్తానని తెలిపినట్లు పాలకవర్గం సభ్యులు తెలిపారు.