JN: దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలో నిర్మించబోయే పల్లె దవాఖాన కోసం తన స్వంత భూమి 200 గజాలు గ్రామ పంచాయతీకి ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. వారి కొడుకు జ్ఞాపకార్ధంగా భూమిని ఇస్తున్నట్లు తెలిపారు. కాగా వారిని గ్రామ సర్పంచ్ పంజాల శ్రీధర్తో పాటు పలువురు అభినందించారు.