BDK: ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించడంతో జిల్లాలోని దరఖాస్తుదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 1.13 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా కొత్తగా 69,136 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 7,438 మంది దివ్యాంగులు ఉండగా మిగిలిన వారు వృద్ధాప్య ఇతర కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్నారు.