WNP: జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని, ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీత రెడ్డి హెచ్చరించారు. పెద్దమందడి, గోపాలపేట, ఏదుల, రేవల్లి, ఘనపురం మండలాల్లోని ఓటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.