PDPL: మంథనిలోని శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోమాతను పూలతో అలంకరించి, దాన సమర్పణ చేసి, ప్రధాన పూజారితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి ప్రదక్షిణ చేసి,పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు, మహిళలు, స్థానిక భక్తుల పాల్గొన్నారు.