MNCL: భీమారం మండలం కాజిపల్లికి చెందిన జాగటి శంకర్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. కాజిపల్లి గ్రామపంచాయతీలో వర్కర్‌గా పనిచేస్తున్న శంకర్ తన కుటుంబ అవసరాల నిమిత్తం చేసిన అప్పును తీర్చలేక మనస్తాపం చెంది గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు SI వెల్లడించారు.