దేశంలో కావాల్సినంత నీరు ఉన్నా కూడా చాలా మంది రైతులు(Formers) సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని, రైతులకు నీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం మహారాష్ట్ర చంద్రాపూర్ కు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి సాదర స్వాగతం పలుకుతున్నట్లు కేసీఆర్(CM KCR) తెలిపారు. ప్రజల్లో చైతన్యం రానంత వరకూ జీవితంలో మార్పురాదన్నారు. కరెంటు విషయంలో తెలంగాణ తప్పా దేశమంతా సంక్షోభమే నెలకొని ఉందన్నారు. దేశంలో నీళ్లు కావాల్సినన్ని ఉన్నా నీటి సంక్షోభం ఎందుకు ఏర్పడుతోందని ప్రశ్నించారు. గడ్చిరోలి నుంచి గోదావరి ప్రవహిస్తూ ఉన్నా అక్కడ మాత్రం తాగునీరు లేదన్నారు.
మహరాష్ట్రలో ఇకపై ప్రతీ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్(BRS) నేతలు ఉంటారని, అన్ని కమిటీలు వేసి మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను బలోపేతం చేస్తామన్నారు. నాగ్పూర్, ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మే 7వ తేది నుంచి జూన్ 7వ తేది వరకూ మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీని వేస్తామని, 12 లక్షల మందితో భారీ కిసాన్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కేసీఆర్(CM KCR) వెల్లడించారు.