»Dismissal Of 200 Striking Artizen Employees In Telangana Power Corporation
200 Artizens Dismiss: సమ్మె చేసిన 200 మంది ఆర్టిజన్ ఉద్యోగులు తొలగింపు
తెలంగాణలో వివిధ విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లపై ప్రభుత్వం అణిచివేత చర్యలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వేతనాలు పెంచాలంటూ సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను తొలగిస్తున్నట్లు(200 Artizens Dismiss) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మరికొందరు బుధవారం ఉదయంలోగా విధుల్లోకి రావాలని, లేని పక్షంలో వారిని కూడా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
వేతనాలు పెంచాలని సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లపై వేటు(200 Artizens Dismiss) పడింది. ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TS GENCO), ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TRANSCO) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు సమ్మె కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం లేదని టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డీ ప్రభాకర్‌రావు తెలిపారు. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ వినియోగాల యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని తెలిపారు.
విద్యుత్తు శాఖల్లోని ఆర్టిజన్ల ఆరు డిమాండ్లకు మద్దతుగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం, ఇత్తెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ మంగళవారం సమ్మెకు నోటీస్ ఇచ్చాయి. విద్యుత్తు సంస్థల్లో దాదాపు 22,500 మంది ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జెన్కో, ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఆర్టిజన్లు అందరూ విధులకు హాజరవగా, డిస్కమ్‌లలో పనిచేస్తున్న వారిలో 80 శాతం మంది హాజరయ్యారని ప్రభాకర్‌రావు తెలిపారు.
పారిశ్రామిక వివాదాల చట్టం కింద కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు ఏప్రిల్ 19న జాయింట్ కమీషనర్ ఎదుట ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆర్టిజన్లు సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. మంగళవారం విధులకు హాజరుకాని వారు మళ్లీ మళ్లీ హాజరు కావాలని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా రిపోర్ట్(report) చేయడంలో విఫలమైతే, వారు సర్వీస్ నుంచి తొలగించబడతారని చెప్పారు. ఇంకోవైపు సమ్మెలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం ఇప్పటికే హెచ్చరించినట్లు గుర్తు చేశారు.