HYD: భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ అధికారులతో మంత్రి సమీక్షించారు. గత వారం కురిసిన వర్షాలకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.