SDPT: మత్తు పదార్థాలు ఎవరైనా కలిగి ఉన్నా, అమ్మినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు హెచ్చరించారు. శనివారం హాస్పిటల్ ఏరియా, హనుమాన్ నగర్, ఇస్లాంపూర్లోని అనుమానాస్పద కిరాణా షాపులలో నార్కోటిక్ డాగ్స్ తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు.