KNR: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అంబులెన్స్ పైలట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు (ఈఎంటీ) ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్య క్రమంలో పెద్ది శ్రీనివాస్, లక్ష్మణ్, సాగర్, అనిల్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.