మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రవల్లి తండాలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కాంక్షించారు.