KNR: నుస్తులాపూర్ గుర్తుతెలియని దొంగలు వ్యవసాయ బావుల వద్ద సుమారు 10 మంది రైతులకు చెందిన మోటర్ విద్యుత్ వైర్లను చోరీ చేశారు. సమాచారం అందుకున్న సీఐ సదన్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒక్కో రైతు సుమారు రూ.23 వేలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.