MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో సత్యనారాయణ వ్రతాలు ఘనంగా జరిగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం దేవాలయంలోని స్వామి వారికి వేద పండితులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ మండపంలో 143 జంటలు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించాయి.