BHPL: జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలో 59 మద్యం దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయి. గురువారం వరకు 22 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గత ఏడాది ఈ సమయంలో 2,261 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగియనుండగా, 183 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నెల 17, 18న అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశమని ఎక్సైజ్ SP శ్రీనివాస్ ఇవాళ తెలిపారు.