NRML: నాణ్యమైన పత్తికి మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తో కలిసి గురువారం కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. రైతులు పంటను సిసిఐ ద్వారా మాత్రమే అమ్మాలని సూచించారు. క్వింటాకు ₹8,110 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.