NLG: అధిక వడ్డీ మోసాల నిందితుడు బాలాజీ నాయక్ పై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని SP శరత్ చంద్ర స్పష్టం చేశారు. బాలాజీ దుబాయ్‌కు వెళ్లిన వార్తలు అవాస్తవమని, అతని పాస్ పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన అన్నారు. అనుచరుల బెదిరింపుల ఆరోపణలపైన దృష్టి సారించామన్నారు.