NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ చరిత్ర విభాగంలో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం అధ్యాపకుడు ఇస్సపల్లి పోతన్నకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. “మధ్యయుగ దక్కన్ పాలకులు సైనిక వ్యవస్థ (1000-1724)” అనే అంశంపై ప్రొఫెసర్ జి. అంజయ్య మార్గ నిర్దేశనంలో ఆయన పరిశోధన చేశారు.