ADB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీలకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నభావు సాఠే రాష్ట్ర అధ్యక్షుడు, దళిత రత్న నర్సింగ్ మొరే కోరారు. ఆయన శనివారం ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా పాలనాధికారి రాజర్షి షాను కలిసి విన్నవించారు. అదేవిధంగా దళితుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.