CTR: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.