WNPT: ఇంటర్ హాల్ టికెట్ల ప్రివ్యూ లింకును విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపనున్నట్లు వనపర్తి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. మొదటి ఏడాది విద్యార్థులు ఎస్సెస్సీ రోల్ నంబర్, సెకండ్ ఇయర్ వారు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ల నంబర్ ద్వారా వివరాలు చూసుకోవచ్చన్నారు. ఏవైనా తప్పులుంటే వెంటనే కళాశాల ప్రిన్సిపల్ లేదా డీఐఈఓను సంప్రదించాలని సూచించారు.