NLG: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంత్ అన్నా కా సహారా’ పథకాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన వారు ఈ నెల 5 నుంచి 10 వరకు tgobmms.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి విజయేందర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని త్వరగా వినియోగించుకోవాలి.