NGKL: వంగూరు మండలంలోని మిట్టసదగోడు గ్రామంలో జీపు వెంకట్ రెడ్డి (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి బైకుపై వస్తుండగా రోడ్డు పక్కన గుంతలో పడి మరణించారు. ఆదివారం స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.