JGL: బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.