ADB: తాంసీ మండలంలోని ఆత్నంగూడ గ్రామస్తులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు అంశాలపై ఎమ్మెల్యేతో వారు చర్చించారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పనిచేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామస్తులకు సూచించారు.