SRPT: హుజూర్నగర్ పట్టణంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈదురుగాలులు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. ఆకాశం అంతా మేఘావృతమైనప్పటికీ వర్షం మాత్రం కురవలేదు. అయినప్పటికీ, చల్లటి గాలులు వీయడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు.