MNCL: జన్నారం ప్రభుత్వాసుపత్రిని ప్రభుత్వం అప్ గ్రేడ్ చేయాలని మండల ప్రజలు కోరారు. జన్నారం మండలం నాలుగు జిల్లాలకు వెళ్లే సరిహద్దులో ఉంది. దీంతో వివిధ మండలాల నుండి ప్రభుత్వాసుపత్రికి ప్రతిరోజు రోగులు, ప్రజలు వచ్చి వైద్య చికిత్సలు పొందుతున్నారు. దీంతో జన్నారం ఆస్పత్రిని 30 పడకలకు పెంచుతామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాలని ప్రజలు కోరారు.