MDK: నర్సాపూర్ నియోజకవర్గం, పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల, జిన్నారం మండలాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయినట్లు గ్రిడ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చెక్రియల్ నుంచి బోర్పట్ల నీటి శుద్ధి కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోయింది. వెండికోల్ సమీపంలో మంజీరా నది ప్రవాహంలో లీకేజీ జరిగినట్లు భావిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గాక పరిష్కరిస్తామన్నారు.