MNCL: బెల్లంపల్లి పట్టణంలో మాజీ MLA దుర్గం చిన్నయ్య శనివారం ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ‘బాకీ కార్డు’ను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, బీడీ కార్మికులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 పింఛన్, కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.